30 June, 2026 | 11:16 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఇవేం ఎండలు బాబోయ్.. నిప్పుల వాన

28-04-2026 01:48 AM

కరీంనగర్, ఏప్రిల్27(విజయక్రాంతి):ఉమ్మడి జిల్లాలోపగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ మరింత పెరుగుతున్నాయి. మే నెల రాకముందే భాణుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ కేంద్రం  హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే రెండు రోజులు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు  తగ్గనున్న న్నా తీవ్రత ప్రభావం తగ్గేలాలేదు. జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.

ఉదయం 7 గంటల నుంచి ఎంద ప్రచంఢంగా విజృంభిస్తుంది. జగియ్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 44 డిగ్రీలు నమోదు కాగా, కరీంనగర్, పెద్దపల్లి లలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుఅయ్యాయి. ఈక్రమంలో నాలుగు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్జ్ జారీ చేసింది.  అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఈ ఏడాది వర్షాకాలం కాస్త ముందుగానే ప్రారంభం కానున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించిండం ఊపిరి పీల్చుకునే అంశం.