అట్లాంటాలో ఫొటోగ్రఫీ యాత్ర
ప్రపంచ వేదికపై కూచిపూడి నృత్య దృశ్యాలు
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామానికి చెందిన దన్ నాయక్ ఉషశ్రీ, రాధిక శ్రీనివాసరావు దంపతుల కుమారుడు అనిరుధ్ ధన్‌నాయక్ కూచిపూడి నృత్యం దృశ్యాలతో ప్రపంచ వేదికపై భారతీయ సంస్కృతిని చాటుతున్నాడు. అమెరికాలోని అట్లాంటా నగరంలో తన కళాత్మక దృష్టితో భారతీయ ఉనికిని, సంప్రదాయాలను నిలబెడుతున్నాడు.
ప్రస్తుతం ఫోటోగ్రఫీ విద్యార్థిగా ఉన్న అనిరుధ్.. నాట్య సంప్రదాయ: ది డ్యాన్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ పెర్మ్ఫార్మింగ్ ఆర్ట్స్ పేరుతో విశిష్టమైన ఫోటోగ్రాఫిక్ పరిశోధన ప్రాజెక్టును రూపొందించి ప్రశంసలు అందుకుంటు న్నారు. కూచిపూడి నృత్యాన్ని ఆధారంగా చేసుకుని అమెరికాలో నివసిస్తున్న భారతీ వలస సమాజంలో సంస్కృతి, వారసత్వం, గుర్తింపు ఎలా తరాల మధ్య కొన సా గుతున్నాయనే అంశాన్ని అనిరుధ్ తన కెమెరా ద్వారా ఆవిష్కరిస్తున్నారు. అమెరికాలో తన తొలి రోజుల్లో స్వదేశపు జ్ఞాపకాలను వెతుక్కుంటూ తిరిగిన అనిరుధ్‌కు ఈ ప్రాజెక్ట్ భావోద్వేగ క్షణం నుంచి ప్రారంభమైంది. అట్లాంటాలోని ఓ హిందూ దేవాలయాన్ని సందర్శించినప్పుడు వినిపించిన శాస్త్రీయ సంగీత ధ్వని ఆయనను కూచిపూడి తరగతి వరకు తీసుకెళ్లింది.
ఈ ప్రాజెక్టులో ప్రధాన పాత్ర పోషించిన వారిలో అ ట్లాంటాకు చెందిన ప్రముఖ కూచిపూడి గురువు శశికళ ఒక రు. ఆమె శిక్షణలో అనేక మంది విద్యార్థులు నృత్యాన్ని మాత్రమే కాకుండా భారతీయ కథన సంప్రదాయం, ఆధ్యాత్మికత, సంస్కృతి, తమ మూలాలతో అనుబంధాన్ని కూడా నేర్చుకుంటున్నారు. అనిరుధ్ కెమెరా కేవలం వేదికపైనే నిలవదు. గురువు-శిష్యుల మధ్య నిశ్శబ్ద క్షణాలు, సాధనలోని ఏకాగ్రత, కాటుక కళ్ల వెనుక దాగి ఉన్న భావోద్వేగాలను కూడా బంధిస్తుంది.
ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ సిరీస్‌లో భాగంగా మే 22న ప్రారంభమైన ఈ ప్రదర్శన మే 24, 2026 వరకు కొనసాగింది. అట్లాంటాలో మే 15న సవన్నా కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్లో ఫోటోగ్రఫీ విద్యార్థి అయిన అనిరుధ్ రూపొందించిన నాట్య సంప్రదాయ: ది డ్యాన్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆరట్స్ అనేది భారతీయ అమెరికన్ వలస సమాజంలో సాంస్కృతిక కొనసాగింపుపై ఒక ఫోటోగ్రాఫిక్ అన్వేషణ. అనిరుధ్ ఫోటోగ్రాఫ్ ప్రదర్శనను, ఆత్మీయ తను రెండింటినీ బంధిస్తాయి.
ఈ చిత్రాల ద్వారా వారసత్వంలో లోతుగా పాతుకుపోతూనే, సమకాలీన అమెరికన్ జీవితం ద్వారా కూడా రూపుదిద్దుకుంటారు. ఈ ప్రాజెక్ట్ కేవలం నృత్యం గురించి మాత్రమే కాదు, తరాల తరబడి వారసత్వాన్ని, గుర్తింపును, సాంస్కృతిక జ్ఞాపకాలను పరిరక్షించడం గురించి‘ అని అనిరుధ్ అంటున్నారు. స్కాడ్ ఎమ్‌ఎఫ్‌ఏ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ సిరీస్‌లో భాగంగా ఈ ఎగ్జిబిషన్ మే 22 నుండి మే 24 వరకు అట్లాంటాలోని 785 ఎకో స్ట్రీట్ ఎన్‌డబ్ల్యూ వద్ద ఉన్న ఎకో కాంటెంపరరీ ఆర్టులో జరిగింది.






