3 April, 2026 | 3:29 AM

అందరికీ అండగా ప్రజా ప్రభుత్వం - సంక్షేమ పథకాలతో ప్రజలకు భరోసా..

03-04-2026 12:32 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

వేములవాడ, ఏప్రిల్ 2, (విజయక్రాంతి)ప్రజా ప్రభుత్వం ప్రతి వర్గానికి అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రజా పాలనప్రగతి ప్రణాళికలో భాగంగా చెక్కపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభ, వేములవాడ పట్టణం 25వ వార్డులో నిర్వహించిన వార్డు సభలకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, త్వరలో రేషన్ కార్డు లబ్ధిదారులకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ భీమా పథకం అమలు చేస్తామని తెలిపారు.

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు ఆర్థిక భరోసా కలుగుతోందన్నారు.అనంతరం కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆర్డీఓ రాధాభాయి, డీఎస్పీ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ సంపత్,డిపిఓ షర్పుద్ధిన్, మండల ప్రత్యేక అధికారి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మిరాజం,ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, చెక్కపల్లి సర్పంచ్ లక్ష్మీ,తదితరులు పాల్గొన్నారు.