రోబోటిక్ శస్త్రచికిత్సతో కొత్త జీవితం
10 ఏళ్ల బాలుడికి వెన్నుముక క్యాన్సర్
ప్రాణాలు కాపాడిన కిమ్స్ ఆస్పత్రి వైద్యులు
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): అరుదైన వెన్నుముక క్యాన్సర్‌తో బాధపడుతున్న 10 ఏళ్ల బాలుడికి కొత్త జీవితాన్ని అందించారు కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్ వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను కన్సల్టెంట్ స్పున్ సర్జన్ డా. కృష్ణ చైతన్య వెల్లడించారు.
హైదరాబాద్ నగరానికి చెందిన హిమ సాయి అనే బాలుడు ఈవిం గ్ సార్కోమా అనే క్యాన్సర్ అంటే చిన్నారుల్లో ఎక్కువగా వచ్చే ఒక రకమైన ఎము కల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఆంకాలజీ బృం దం పర్యవేక్షణలో బాబుకు ముం దుగా రెండు సైకిళ్ల కీమోథెరపీ ఇచ్చారు. చికిత్సకు మంచి స్పందన రావడంతో అత్యంత క్లిష్టమైన రోబోటిక్ మార్గదర్శకత్వం లో ఎల్4 వెర్టిబ్రా ఎన్-బ్లాక్ తొలగింపు, ఫిక్సేషన్ శస్త్రచికిత్స నిర్వహించారు.
రోబోటిక్ సాంకేతికతతో శస్త్రచికిత్సకు ముందస్తు ప్రణాళిక మరింత ఖచ్చితంగా చేయగలిగామని, అసాధారణ నిర్మాణాల్లో కూడా పెడికల్ స్క్రూల ను సరిగ్గా అమర్చగలిగామని, ట్యూమర్ను పూర్తిగా తొలగించ డానికి నియంత్రితంగా కట్స్ చేయగలిగామన్నారు. శస్త్రచికిత్స అనంతరం బయాప్సీ నివేదికల్లో ట్యూమర్ పూర్తి గా తొలగించబడినట్లు, క్లియర్ మార్జిన్స్ ఉన్నట్లు నిర్ధారితమైంది. బాలుడు ఎటువం టి న్యూరోలాజికల్ లోపాలు లేకుండా స్వ యంగా నడుస్తూ కోలుకుని డిశ్చార్జ్ అయ్యా డు. ఈ శస్త్రచికిత్స ప్రక్రియకు డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ హర్ష విక్రమ్ నాయకత్వం వహించగా, ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక నిపుణుల సహకారం అందించారు.






