1 July, 2026 | 12:49 AM

ఏరోస్పేస్ రాజధాని తెలంగాణ

01-07-2026 12:00 AM
  1. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రక్షణ వ్యవస్థల తయారీ
  2. ప్రపంచ పటంలో అగ్రస్థానంలో హైదరాబాద్ 
  3. ఆకాశంలో ఎగురుతున్న ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ముద్ర 
  4. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల పనులు త్వరలో ప్రారంభం
  5. కొత్తగూడెం విమానాశ్రయానికీ త్వరలో గ్రీన్ సిగ్నల్
  6. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  7. హెచ్‌ఐసీయూలో ఏరోమార్ట్ హైదరాబాద్ అంతర్జాతీయ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బిజినెస్ కన్వెన్షన్ ప్రారంభోత్సవం 

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమకు తెలంగాణ రాజధానిగా అవతరిస్తోందని, ఇకపై అత్యాధునిక విమానాలు, యుద్ధ విమానా లు, హెలికాప్టర్లు, రక్షణ వ్యవస్థల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలవబోతోందని నీటిపారుదల, పౌ ర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో మంగళ వారం జరిగిన ఏరోమార్ట్ హైదరాబాద్- 2026 అంతర్జాతీయ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బిజినెస్ కన్వెన్షన్‌ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు.

‘ప్రపంచ ఏరోస్పేస్ రంగం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. పెట్టుబడులు, పరిశ్రమలు, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణే కొత్త చిరునామా’ అని స్పష్టం చేశారు. భారత వైమానిక ద ళం లో ఫైటర్ పైలల్‌గా పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, సూపర్‌సోనిక్ యుద్ధ విమానాలను నడిపిన వ్యక్తిగా ఏరోస్పేస్ రం గంలో నాణ్యత, ఖచ్చితత్వం ఎంత కీలకమో తనకు ప్రత్యక్ష అనుభవం ఉందన్నారు. ‘ఒక్క చిన్న విడిభాగం లోపం కూడా మిషన్ విజయాన్ని ప్రభావితం చేస్తుంది.

అలాంటి అ త్యున్నత ప్రమాణాలను తెలంగాణ పరిశ్రమలు నేడు విజయవంతంగా అందిస్తున్నా యి’ అని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి హె లికాప్టర్‌కు అవసరమైన క్యాబిన్లు, అ పాచీ యుద్ధ హెలికాప్టర్ల నిర్మాణ భాగాలు, ఎఫ్16 యుద్ధ విమానాల రెక్కలు, ప్రపంచ ప్రఖ్యాత ఏరో ఇంజిన్ విడిభాగాలు, ఎంఆర్‌ఓ వ్యవస్థలు నేడు తెలంగాణలోనే తయార వుతు న్నాయన్నారు. ‘మేడ్ ఇన్ తెలంగాణ’ అనే ముద్ర ఇప్పుడు ప్రపంచ ఆకాశంలో గర్వం గా ఎగురుతోంది’ అన్నారు.

తెలంగాణలో ఇప్పటికే 1,500కు పైగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సేవలందిస్తున్న ఎంఎస్‌ఎంఈలు పనిచేస్తున్నాయని, పరిశ్రమలకు అవసరమైన అత్యాధునిక పారిశ్రామిక పా ర్కులు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చాయన్నారు.

యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్సిటీ, ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మారుతున్న ఐటీఐలు ప్ర పంచ స్థాయి ఏరోస్పేస్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన యువతను తీ ర్చిదిద్దుతున్నాయన్నారు. తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం గత కొన్నేళ్లుగా దాదా పు 30 శాతం వార్షిక వృద్ధిని నమోదు చే యగా, గతేడాది ఎగుమతులు 103 శాతం పెరిగి, రాష్ట్రానికి ఎన్నో దశాబ్దాలుగా అగ్రగామిగా ఉన్న ఔషధ రంగాన్నే అధిగమించడం తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక స్వర్ణ అధ్యా యమని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణలో అంతర్జాతీయ పెట్టుబడులు

స్పెయిన్‌కు చెందిన ఐటీపీ ఏరో, కెనడాకు చెందిన ఎఫ్‌టీజీ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక విశ్వసనీ యతకు నిదర్శనమన్నారు. ఫ్రాన్స్, ఇటలీ సహా 25కిపైగా దేశాల కంపెనీలు ఏరోమార్ట్‌లో పాల్గొనడం తెలంగాణ అంతర్జాతీయ ప్రాధాన్యతను మరింత పెంచిందన్నారు. అ మెరికా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జపాన్, ఇజ్రాయెల్, కెనడా సంస్థలకు హైదరాబాద్ తొలి ఎంపిక అన్నారు.

‘మీ తదుపరి తయా రీ కేంద్రం తెలంగాణ కావాలి. మీ తదుపరి పెట్టుబడి హైదరాబాద్‌లో ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం మీకు అనుమతులు ఇచ్చే ప్రభుత్వం మాత్రమే కాదు.. మీ విజయానికి భాగస్వామిగా నిలిచే ప్రభుత్వం’ అని ఆయ న పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధుల నుంచి అధికార యంత్రాంగం వరకు పెట్టుబడిదారులకు 24 గంటలూ అందుబాటులో ఉం టామని హామీ ఇచ్చారు. ‘ఏరోమార్ట్ హైదరాబాద్2026 కేవలం ఒక పారిశ్రామిక సదస్సు కాదు..

ప్రపంచ ఏరోస్పేస్ పటంలో తెలంగాణ శాశ్వత స్థానాన్ని ఖరారు చేసే చా రిత్రక వేదిక’ అని మంత్రి  పేర్కొన్నారు. డీఆర్డీఓ, రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, పరిశోధ నా కేంద్రాలు, ప్రైవేట్ పరిశ్రమలు ఒకే నగరంలో ఉండటం హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యాన్ని కల్పించిందన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం విమానయాన రంగ విస్తరణకు చారిత్రక నిర్ణయాలు తీసుకుందని మంత్రి వెల్లడించారు.

వరంగల్ విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన, ఆదిలా బాద్‌లో పౌర-సైనిక అవసరాలకు అనువైన ఎయిర్‌ఫీల్డ్, కొత్తగూడెం విమానాశ్రయానికి త్వరలో కేంద్ర ఆమోదం లభించనున్నాయన్నారు. ఏరోస్పెస్ డైరెక్టర్ పిఏ ప్రవీణ్, రీజనల్ ప్రోక్యూర్ మెంట్ హెడ్ ఆండ్రీస్ స్పీహ్వబ్, జాతీయ భద్రతా సలహామండలి సభ్యులు జీ. సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.