12 May, 2026 | 5:20 AM

పదేళ్లపాటు పేరు వినబడేలా పురుషః

12-05-2026 12:45 AM

కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు ‘పురుషః’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంతో పవన్‌కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. వీరు ఉలవల దర్శకత్వం వహించారు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్యపాత్రలను పోషించారు. మేకర్స్ ఈ సినిమా మే 22న రిలీజ్ బత్తుల మాట్లాడుతూ.. “పురుషః’ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం. అందరూ మా సినిమాను చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా” అన్నారు.

‘నేను ఈ కథను ఎలా అనుకున్నానో అలానే తీయగలిగాన’ని దర్శకుడు వీరు చెప్పారు. నటుడు సప్తగిరి మాట్లాడుతూ.. “పురుషః’ సినిమా మొత్తం డైరెక్టర్ వీరూపైనే ఆధార పడి ఉంది. తప్పకుండా తన మార్కు చూపించే ప్రయత్నం చేశాడు. హీరోగా వీరూ పేరు ఈ ఒక్క సినిమాతో కాకుండా ఒక పదేళ్లపాటు వినపడేలా ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కసిరెడ్డి రాజ్‌కుమార్, హాసిని సుధీర్, రాయంచ, విషిక తదితర చిత్రబృందం కూడా మాట్లాడారు.