12 May, 2026 | 11:44 AM

Breaking News

మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •  

మత సామరస్యం చాటిన మానవ మూర్తి

16-12-2025 08:19 PM

బ్రహ్మంగారి ఆలయానికి రూ 2.50 లక్షల విరాళం..

నిర్మల్ (విజయక్రాంతి): హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమన్ అలీ మంగళవారం మతసామరస్యాన్ని చాటారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునః ప్రతిష్టాపన పనుల కోసం రూ. 2.50 లక్షల విరాళాన్ని అందించి మానవతను చాటుకున్నారు. బ్రహ్మంగారి ఆలయానికి విరాళం అందించిన గ్రంథాలయ చైర్మన్ ను నిర్మల్ పట్టణ విశ్వబ్రాహ్మణ సోదరులు సంఘ సభ్యులు ప్రత్యేకంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి శ్రీధర్ రాకేష్ రమణ కోటగిరి గోపి మేడారం ప్రదీప్ ముప్పిడి రవి జగదీష్ తదితరులు ఉన్నారు.