15 June, 2026 | 6:11 PM

Breaking News

పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •   యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం   •  

వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం ఏర్పాటు చేయాలి

24-03-2026 12:39 AM

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు 

చౌటుప్పల్ , మార్చి 23: చౌటుప్పల్ పట్టణంలో బాలుర కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు అన్నారు. సోమవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రజావాణిలో చౌటుప్పల్ పట్టణంలో వెనుకబడిన తరగతుల బాలుర కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ చౌటుప్పల్ మండల అధ్యక్షులు దాసరి ప్రకాష్ తో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ హైదరాబాద్ అతి దగ్గరలో ఉన్న చౌటుప్పల్ పట్టణంలో కళాశాల వసతి గృహం లేక విద్యార్థులు  చదువుకు దూరమయ్యే పరిస్థితి, చౌటుప్పల్ పట్టణంలో పది నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.

మారుమూల గ్రామాల నుండి విద్యార్థులు రోజు మూడు వేల నుండి 5000 మంది విద్యార్థులు చదువుకోవడానికి చౌటుప్పల్ పట్టణానికి వస్తుంటారు గ్రామాల నుండి సరైన బస్సు సౌకర్యం లేక విద్యార్థుల సమయానికి కళాశాలలకు చేరుకునే పరిస్థితి లేదు,కళాశాల వసతిగృహ ఉంటే విద్యార్థులు చదువులు అభ్యసించడం జరుగుతా ఉన్నది కావున ప్రభుత్వం వెంటనే స్పందించి చౌటుప్పల్ పట్టణంలో కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐగా డిమాండ్ చేస్తున్నారు.