24 March, 2026 | 8:41 AM

టెన్త్ మూల్యాంకనం రేట్లు పెంచాలి

24-03-2026 12:39 AM
  1. ఉద్యోగుల ఆధార్ అనుసంధానికి మరో అవకాశమివ్వండి

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వినతి పత్రం సమర్పణ

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం రేట్లు పెంచాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులగం దామోదర్ రెడ్డి, సుంకరి బిక్షం గౌడ్ కోరారు. ఈ మేరకు అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని వారు కలిసి వినతి పత్రం సమర్పించారు. 2018 నుంచి ఇప్పటి వరకు పదో తరగతి మూల్యాంకనం రేట్లు పెంచలేదన్నారు.

అదేవిధంగా ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్లో ఆధార్ అనుసంధానం మిస్ మ్యాచ్ కావడంతో 5 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఫిబ్రవరి నెల జీతాలు రాలేదని, ఆధార్ అనుసంధానానికి మరొక అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశామని, ఆర్థిక శాఖాధికారులకు సీఎం ఆదేశాలిచ్చి మూడు రోజులు అవకాశం కల్పించారని తెలిపారు. సీఎంను కలిసిన వారిలో పీఆర్టీయూ టీఎస్ అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, ఆడిట్ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.