డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యావిధానం అమలు చేయాలి
వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ జ్ఞాన ప్రకాష్
కామారెడ్డి, జూలై 27 (విజయక్రాంతి): తెలంగాణలోని తొలి ఏకైక డైరీ టెక్నాలజీ కళాశాలను సోమవారం యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ జ్ఞాన ప్రకాష్, రిజిస్టర్ డాక్టర్ శరత్ చంద్ర సోమవారం కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కళాశాలలోని అన్ని విభాగాలను తనిఖీలు చేశారు. కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కళాశాలకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తామని వారు తెలిపారు.
కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థి విద్యార్థులకు నాణ్యతతో కూడిన నూతన విద్యా విధానాన్ని అనుగుణంగా విద్యా బోధన, పరిశోధన ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ జ్ఞాన ప్రకాష్ ,పశువైద్య కళాశాల రిజిస్టర్ డాక్టర్ శరత్ చంద్ర, డీన్ డాక్టర్ ఉదయ్ కుమార్, విద్యార్థి విభాగ మధిపతి డాక్టర్ సతీష్ కుమార్, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సురేష్ రాథోడ్, ఉమాపతి, ఇతర అధ్యాపకులు కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






