13 July, 2026 | 5:26 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

పురపోరులో హస్తం హవా!

14-02-2026 01:55 AM

66 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం

  1. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 36 స్థానాల్లో హంగ్
  2. 13 మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ గెలుపు 
  3. ఫార్వర్డ్ బ్లాక్ ఖాతాలో వడ్డేపల్లి మున్సిపాలిటీ 
  4. ఏడు కార్పొరేషన్లలో 4 కాంగ్రెస్ కైవసం 
  5. సీపీఐ ఖాతాలో కొత్తగూడెం కార్పొరేషన్!
  6. కరీంనగర్, నిజామాబాద్‌లో గెలుపు దిశగా బీజేపీ

* కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఈ విజయం అంకితం.. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ తీర్పు ద్వారా ప్రజలు సంపూర్ణ ఆమోదం తెలిపారు. ఈ విజయం మా బాధ్యతను పెంచింది.

   సీఎం రేవంత్‌రెడ్డి

అందరూ ఊహించినట్లే రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. అయితే.. గత మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్‌ఎస్ కంటే.. ప్రస్తుత అధికార పార్టీగా తక్కువ స్థానాలు గెలుచుకోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపల్ స్థానాల్లో ౩6 స్థానాల్లో హంగ్ ఏర్పడింది. మిగతా 80 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలు దక్కించుకున్నది. 13 సాన్థాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించింది.

ఒక స్థానంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే ఏడు నగరపాలక సంస్థల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నల్ల గొండ, మహబూబ్‌నగర్, మంచిర్యాల, రామగుం డంలను కైవసం చేసుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ దక్కించుకున్నది. మిగిలిన నిజా మాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో బీజేపీ విజయం వైపు పయనిస్తున్నది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 2,582 వార్డులు ఉండగా, వాటిలో 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మృతి చెందడంతో ఆ వార్డు ఎన్నిక వాయిదాపడింది. ఇక మిగిలిన 2,567 వార్డుల్లో 10,719 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 1,347 మంది, బీఆర్‌ఎస్ అభ్యర్థులు 717మంది, బీజేపీ 261 మంది, ఇతరులు 256 మంది విజయం సాధించారు. అలాగే ఏడు నగరపాలక సంస్థల పరిధిలో 414 డివిజన్లు ఉండగా, రెండు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి.

మిగతా 412 డివిజన్లకు పోలింగ్ నిర్వహించగా, 2,225 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ౧౭౭ డివిజన్లలో విజయం సాధించారు. అలాగే బీఆర్‌ఎస్ ౫౭ స్థానాలు, బీజేపీ ౭౦ స్థానాలు, ఇతరులు ౭౪ స్థానాల్లో విజయం సాధించారు. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున క్యాంప్ రాజకీయాలకు తెరలేసింది.