13 July, 2026 | 1:20 AM

ఓటరు జాబితా సవరణను సమర్థవంతంగా పూర్తి చేయాలి

13-07-2026 12:21 AM

సర్పంచ్ దేవన్నగారి శేఖర్

కొల్చారం, జూలై 12: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కొల్చారం గ్రామ సర్పంచ్ దేవన్నగారి శేఖర్ సూచించారు.

ఆదివారం గ్రామంలో కొనసాగుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి బీఎల్‌ఏలు, సంబంధిత సిబ్బందికి పలు సూచ నలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, బూత్ల పరిధిలో పనిచేస్తున్న బీఎల్‌ఏలు చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కొత్తగా అర్హత పొందిన ఓటర్ల నమోదుతో పాటు, ఓటరు వివరాల్లోని తప్పులను సవరించడం, నకిలీ ఓట్లను గుర్తించి తొలగించడం వంటి ప్రక్రియలను బాధ్యతాయుతంగా చేపట్టాలని సూచించారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో ఉండేలా చూడటం అందరి బాధ్యత అని అన్నారు. ఇంటింటికీ వెళ్లి కొత్త ఓటర్లను గుర్తించడం, జాబితాలోని తప్పులను సరిచేయించడం, మరణించిన వారు లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిన వారి వివరాలను ఎన్నికల అధికారుల దృ ష్టికి తీసుకెళ్లడం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమం లో సంగమేశ్వర్, మహేశ్వర్ రెడ్డి, అక్రమ్, సాకేత్, కిరణ్ తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.