27 June, 2026 | 7:05 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

పది ఫలితాల్లో 91.8శాతం ఉత్తీర్ణత

30-04-2026 12:47 AM
  1. మండల టాపర్‌గా లింగాయపల్లి- చీకోడ్  విద్యార్థి హర్షవర్ధన్ రెడ్డి 
  2. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించిన ఎంఈఓ 

పాపన్నపేట, ఏప్రిల్29: బుధవారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో పాపన్నపేట మండలం 91.8 శాతం ఉత్తీర్ణత సాధించింది. మండలంలో 11 ఉన్నత పాఠశాలలకు గాను 5 ఉన్నత పాఠశాలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత వచ్చింది. మండలంలో 91.8శాతం ఉత్తీర్ణత సాధించినందుకు గాను ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి అభినందించారు.

లింగాయపల్లి-చీకోడ్ పాఠశాల విద్యార్థి కే. హర్షవర్ధన్ రెడ్డి 579 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచాడు. కొడపాక ఉన్నత పాఠశాలకు చెందిన అప్ష 563 మార్కులు సాధించి సెకండ్ టాపర్ గా నిలవగా, లింగాయపల్లి-చీకోడ్ పాఠశాలకు చెందిన ఓంకారేశ్వరి 561 మార్కులు సాధించి మూడవ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించారు. 91.8 శాతం ఉత్తీర్ణతకు కష్టపడ్డ ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.