24 August, 2026 | 3:54 AM

కాంగ్రెస్ గ్రామ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

24-08-2026 02:37 AM

వెంకటాపూర్, ఆగస్టు 23 (విజయక్రాంతి): మండలంలోని నారాయణపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కుంట్ల అశోక్, ఉపాధ్యక్షుడిగా మండల తిరుపతి, ప్రధాన కార్యదర్శులుగా అజ్మీరా సంతోష్, లొట్టపెట్టెల సుధాకర్, గుగులోత్ ప్రేమ్ సింగ్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కుంట్ల అశోక్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానని, గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని, పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ పెద్దలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.