30 August, 2026 | 6:33 PM

కార్మిక హక్కుల కోసం పోరాడిన వ్యక్తి గ్యానం సారయ్య

30-08-2026 05:30 PM

వెంకటాపురం (నూగూరు) ఆగస్టు 30(విజయక్రాంతి): కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి గ్యానం సారయ్య, తన ఆశయం కోసం కార్మికులు, కర్షకులు, గిరిజన,గిరిజనేతర సమస్యల కోసం పోరాటాలు చేయడమే మనం సారయ్య కు ఇచ్చే ఘనమైన నివాళి అని సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జీ. నాగయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి శ్రీను అధ్యక్షతన గ్యానం సారయ్య 5వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

సారయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెంకటాపురం మండలంలో సీపీఐ(ఎం) పార్టీ ఎదుగుదలకు దశాబ్దాలుగా పోరాడిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఎక్కడ పేదల సమస్య వచ్చినా వారి హక్కుల కోసం పోరాడిన వ్యక్తి సారయ్య అని గుర్తు చేశారు.పార్టీ కార్యకర్తగా చేరి సీపీఐ(ఎం) పార్టీలో అంచలంచలుగా ఎదుగుతూ పలు పోరాటాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. భూమికోసం పేదలగూడు కోసం పలు పోరాటాలకు నాయకత్వం వహించిన సారయ్యకు ఇంటి స్థలం కూడా లేదని గుర్తు చేశారు. నిస్వార్థకు నిలువెత్తు సాక్ష్యం సారయ్య అన్నారు.

ఈ కార్యక్రమంలో  పార్టీ రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ, నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, మండల కార్యదర్శి గ్యానం వాసు, జిల్లా కమిటీ సభ్యులు వంకా రాములు, చారి, కొప్పుల రఘుపతి, నాయకులు గుర్రం పుల్లారావు, సర్పంచ్ కొరసా నరసింహారావు, పర్షిక రాంబాబు, పండా శీను, కాపుల వెంకటేశ్వర్లు,రౌతు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.