మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆండాలమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం(Mandal General Assembly meeting) నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి(MLA Dr. Patlolla Sanjeeva Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల(Welfare schemes) అమలు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి రోహిణి, ఎంఈఓ శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ వినోద్ పాటిల్, డిప్యూటీ తహసీల్దార్ హేమంత్ కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే సిర్గాపూర్ డిజిటల్ రేషన్ కార్డులు కూడా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పంపిణీ చేయడం జరిగింది.






