31 August, 2026 | 3:43 AM

కుంటలో పడి అన్నదమ్ముల దుర్మరణం

31-08-2026 12:15 AM

ములుగు జిల్లాలో దుర్ఘటన 

ములుగు, ఆగస్టు 30 (విజయక్రాంతి): రాఖీ పండగకి తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు విద్యార్థులు బహిర్భూమి కోసం కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి దుర్మరణం పాలైన ఘటన ములుగు జిల్లా కేంద్రం పరిధిలోని గణేష్ లాల్‌పల్లిలో ఆదివారం జరిగింది.

ఇదే జిల్లా మంగపేట మండలం కమలాపురానికి చెందిన మాలోతు స్వాతి తన తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు భర్త యాకూబ్, ఇద్దరు పిల్లలు రాజేష్ (15), వినయ్ (12) కలిసి గణేష్ లాల్ పల్లికి వచ్చింది. రాఖీ కట్టిన తర్వాత స్వాతి, యాకూబ్ కమలాపురం వెళ్లిపోగా, ఆదివారం సెలవు కావడంతో అమ్మమ్మ ఇంట్లో ఉండి మరుసటి రోజు వస్తామని పిల్లలిద్దరూ ఉండిపోయారు. ఈ క్రమంలో బహిర్భూమికి కుంట వద్దకు వెళ్లిన వీరు అందులో పడి మరణించారు.