నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి
03-09-2026 | 08:36pm
హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్ఠానం ప్లానింగ్ వైస్ ఛైర్మన్(Planning Vice Chairman) పదవి నుంచి తొలగించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జిల్లెల చిన్నారెడ్డి(Senior Congress leader Jillela Chinna Reddy) స్పందించారు. నాకు పదవులపై ఆశ లేదని, పదవి ఉన్నా లేకున్నా నాకు గౌరవం ఉంటుందని, నాకుండే గౌరవంతో ఎవరైనా ఏ పనైనా చేస్తారని ఆయన పేర్కొన్నారు. కేబినెట్ హోదా ఉన్నప్పుడే కారు, డ్రైవర్, భద్రతను తీసుకోలేదని, పదవి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(Chief Minister Revanth Reddy) కలిసే ప్రయత్నం చేయలేదని చిన్నారెడ్డి తెలిపారు. నా వర్గం క్యాంపు ఆఫీసుకి వస్తే మెడపట్టి తొక్కుతా అన్నా.. ఓపిక పట్టా, గోపాలపేటలో కార్యకర్తలకు నేను భరోసా ఉన్న అన్నదే చెప్పా అని ఆయన వాపోయ్యారు.






