30 August, 2026 | 4:09 PM

ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి

30-08-2026 03:25 PM

ఆలయ అభివృద్ధికి రూ.25 వేల విరాళం అందజేసిన వంగ రాజేశ్వర్ రెడ్డి..

సిద్దిపేట రూరల్,ఆగస్టు 30 (విజయక్రాంతి): ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సిద్దిపేట నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని వంగ రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి సహిత విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వంగ రాజేశ్వర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా రూ.25 వేల విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కోడూరు మమతా రాజు, ఉపసర్పంచ్ అల్లం సాయి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.