1 September, 2026 | 8:04 PM

మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు

01-09-2026 | 06:29pm

కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలం సిరిసినగండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో(Sirisinagandla Government High School) మంగళవారం మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు(Mandal level SGF sports competitions) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంఇఓ పి.శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎచ్ఎం పెద్ది విఠల్, జీహెచ్ఎంలు సీహెచ్ రామచంద్రం, కే. శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ముస్త్యాల యాదవ్వ తదితరులు పాల్గొని పోటీలను ప్రారంభించారు. మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఎంఈఓ తెలిపారు.