17 July, 2026 | 9:26 PM

పొలానికి నీళ్లు పార పెట్టేందుకు వెళ్లి రైతు మృతి

17-07-2026 09:18 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ  పట్టణంలోని ఫిల్టర్ బెడ్ వద్ద గల పంట పొలాల లో శుక్రవారం ఉదయం అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శాంతినగర్ కాలనీ కి చెందిన దేశాయిపేట్ నారాయణ వయసు 45 సం లు తండ్రి గంగారం గంగపుత్ర కులస్తులు పాత బాన్సువాడ లోని గురు సిద్దేశ్వర్ పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు.కౌలు చేస్తున్న పొలంలో నీరు పార పెట్టడానికి గురువారం రాత్రి పది గంటల సమయంలో భోజనం చేసి వెళ్లి తిరిగి రాలేదని అతని భార్య దేశయిపేట సుజాత ఉదయం 8 గంటల ప్రాంతంలో పొలం వద్దకు వెళ్లి చూడగా ప్రమాదవశాత్తు జారిపడి బోర్ల పడడంతో శ్వాస ఆడక మృతి చెంది ఉన్నట్లు మృతుని భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సిఐ తుల శ్రీధర్ తెలిపారు.