17 July, 2026 | 5:15 PM

తాండూరు గ్రామాన్ని సందర్శించిన ఎల్లారెడ్డి డిఎస్పి

17-07-2026 05:04 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామాన్ని ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాస్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాస్ గ్రామంలో ఉన్న భద్రత సమస్యల గురించి చర్చించడం జరిగింది. అలాగే సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గ్రామంలో మాదకద్రవ్యాలు నిషేధించాలని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, మొదలైన వాటి గురించి భద్రత విషయాలు గురించి తెలియజేయడం జరిగింది.

అనంతరం గ్రామ పరిధిలో మంజీరా నది ఒడ్డున ఉన్నటువంటి త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. త్రిలింగ రామేశ్వర ఆలయం విశిష్టతను ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాస్కు గ్రామ సర్పంచ్ యాద గౌడ్ వివరించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాస్ స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్లను శాలువాతో ఘనంగా సన్మానించారు.