15 August, 2026 | 4:23 PM

సేవా పథకం అవార్డు అందుకున్న గుండగాని మహేందర్

15-08-2026 03:51 PM

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఐజీపీ, ఎస్పీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న మహేందర్*

తుంగతుర్తి, (విజయ క్రాంతి): 80 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ పథకాలలో భాగంగా పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించినందుకు “సేవా పథకం” అవార్డుకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన గుండగాని మహేందర్(HC 953) ఎంపికయ్యారు.

మహేందర్ ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహించి బదిలీపై వచ్చి ముఖ్యమంత్రి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. మహేందర్ నిబద్ధతను గుర్తించిన, ఉన్నత అధికారులు సేవా పథకానికి ఎంపిక చేశారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గజరావు భూపాల్, ఐపీఎస్, ఐజీపీ  మరియు ఏ. రాజేష్, ఎస్పీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన “సేవా పథకం” అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ... అవార్డు అందుకోవడం తనకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందని తెలిపారు. తన సేవలను గుర్తించి, ఈ గౌరవాన్ని అందించిన ఐజీపీ కి, ఎస్పీ కి  కృతజ్ఞతలు, తెలిపారు. మహేందర్ కు పథకం రావడం పట్ల దీనితో వెంపటి గ్రామానికి చెందిన మేధావులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.