16 August, 2026 | 2:44 PM

అంబేద్కర్ యువజన నూతన అధ్యక్షునిగా బొంకూరి రంజిత్

16-08-2026 02:00 PM

ప్రజా సేవకుని గుర్తించిన యువజన సంఘ సభ్యులు.

రసవత్తర పోరులో 32 ఓట్లతో గెలిచిన రంజిత్ పట్ల సర్వత్రార్షం

తుంగతుర్తి (విజయ క్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ 40 సంవత్సరాల చరిత్ర కలిగిన అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. అభ్యర్థులుగా బొంకూరి రంజిత్, పాల్వాయి సందీప్  ఇద్దరు పోటీ పడడంతో సమన్యాయకర్తలుగా పాల్వాయి గురువయ్య, మల్లెపాక రవీందర్, బొంకూరి జలంధర్ ఆధ్వర్యంలో  ఎన్నికలు నిర్వహించారు.  ఈ ఎన్నికలలో 74 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోగా  బొంకూరి రంజిత్ కు 53 ఓట్లు పాల్వాయి సందీప్ కు 21 ఓట్లు పడ్డాయి, 32 ఓట్ల భారీ మెజార్టీ సాధించిన బొంకూరి రంజిత్ ను న్యాయ న్యాయ నిర్నేతలుగా బొంకూరి రంజిత్ ను విజేతగా ప్రకటించారు. ఎన్నిక పట్ల బాధ్యత మరింత పెరిగిందని రంజిత్ పేర్కొన్నారు.

అంబేద్కర్ యూత్ క్లబ్ నూతన కమిటీ కార్యవర్గం

ఉపాధ్యక్షులు తడకమల్ల రమేష్ ప్రధాన కార్యదర్శి మరికంటి అశోక్ కోశాధికారి బొంకూరి వెంకన్న సంస్కృతిక కార్యదర్శి బొంకూరు మనోజ్ బంగారి మనోజ్ గేమ్స్ సెక్రటరీ కొండగడుపుల శ్రీను బొంకూరి సాయి తేజ  కత్తుల శరత్ బొంకూరి సందీప్,  బొంకూరి శేషు తదితరులు ఎన్నుకున్నారు.