ఘనంగా బోనాల పండుగ వేడుకలు
16-08-2026 07:06 PM
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), ఆగస్టు16: మండల పరిధిలోని తిమ్మాపురం ఎస్సీ కాలనీ, కోడూరు, లోయపల్లితో పాటు పలు గ్రామాల్లో ఆదివారం ముత్యాలమ్మ అమ్మవారికి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు బోనాలను తలపై ఎత్తుకొని గ్రామ సమీపంలోని ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు జరుపి, మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆయా గ్రామాల పెద్దలు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు బొడ్డు ఇందిరాసోమరాజు, వల్లపు అవిలమ్మ, వల్లపు గంగయ్య, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






