15 August, 2026 | 2:18 PM

బచ్పన్ స్కూలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు

15-08-2026 01:25 PM

అమీన్ పూర్, ఆగస్టు 15: బచ్పన్ AHPS ప్రైమరీ, బీరంగూడలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఉత్సాహభరితంగా దేశభక్తి వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు  సి.హెచ్. శ్రీనివాసరావు, ఆర్.శిరిషారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు  లక్ష్మీ రాఘవేంద్ర సమక్షంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకలు విద్యార్థుల అద్భుతమైన మార్చ్పాస్ట్తో ప్రారంభమయ్యాయి. చిన్నారులు  అతిథులను ఘనంగా ఆహ్వానించారు. అనంతరం మూడవ తరగతి విద్యార్థులు దేశభక్తి నృత్యాలను ఆకర్షణీయంగా ప్రదర్శించి దేశప్రేమ సందేశాన్ని చాటిచెప్పారు.

మూడవ తరగతి విద్యార్థులు తెలుగు, హిందీ మరియు ఆంగ్ల భాషల్లో స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతపై ప్రసంగాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే తెలుగు, హిందీ దేశభక్తి గీతాలను ఆలపించి కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని చేకూర్చారు. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థులు బాల గంగాధర్ తిలక్, భగత్ సింగ్, రాణి లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ వంటి జాతీయ నాయకుల వేషధారణలో పాల్గొన్నారు. వారు ఆ మహనీయుల పాత్రలను ఆత్మవిశ్వాసంతో అభినయించి వారి ప్రసిద్ధ నినాదాలను పలికి అందరినీ ప్రేరేపించారు. మొత్తం పాఠశాల ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మారుమోగింది. ఆనందోత్సాహాల నడుమ ముగిసిన ఈ వేడుక విద్యార్థుల హృదయాల్లో దేశంపై గర్వభావం, ప్రేమాభిమానాలను మరింత పెంపొందించింది.