17 August, 2026 | 3:04 PM

ప్రజావాణిలో రెండే దరఖాస్తులు

17-08-2026 01:47 PM

బోథ్, ఆగస్టు 17, (విజయక్రాంతి):  రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కేవలం రెండే దరఖాస్తులు రావడం జరిగింది. కుచ్చలాపూర్ గ్రామంలో 11 కెవి విద్యుత్ తీగలు తమ ఇండ్లపై నుండి ఉన్నాయని వాటిని తొలగించాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఇక మండలంలో బోర్వెల్ మెకానిక్ గా పనిచేస్తున్న లక్ష్మణ్ మనకు రావాల్సిన వేదనం అందడం లేదని వేతనం అందే విధంగా చూడాలని ఫిర్యాదు చేశారు. కాగా సమావేశంలో 23 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా కేవలం 12 శాఖల అధికారులు మాత్రమే సమావేశానికి వచ్చారు.

వచ్చిన అధికారులు సైతం క్రింది స్థాయి వారు కావటం వల్ల భవిష్యత్తులో ప్రజలకు సమాధానం చెప్పలేక పోతారని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి గ్రామములలో ప్రచారం కురవడంతో తక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని పరిశీలనలు అంటున్నారు. కాగా సమావేశంలో తాసిల్దార్ సుభాష్ చంద్ర ,ఎంపీడీవో ఎల్ రమేష్, ఎంపీ ఈవో ఎం రాజు. విద్యుత్ శాఖ అధికారి రాజుఆల్ ద బెస్ట్ అధికారి కళ్యాణ్ అగ్రికల్చర్ అధికారి భూమన్న ఎస్సీ బీసీ హాస్టల్ వార్డెన్ శ్రావణ్ రెడ్డి. ఆర్ అండ్ బి అధికారి అజ్మత్ అలీ, ఐసిడిఎస్ సూపర్వైజర్, తో పాటు ఇరిగేషన్ అధికారి లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.