15 August, 2026 | 5:58 PM

మాదారం ఐకాన్ పాఠశాలలో ఉప్పంగిన దేశభక్తి

15-08-2026 05:00 PM

ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 

చిన్నారుల ఆకర్షణీయంగా గీతా నృత్యాలు

జిన్నారం/అమీన్ పూర్ ఆగస్టు 15: జిన్నారం, గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని  మాదారం, అమీన్ పూర్ వడక్పల్లి రెండు బ్రాంచ్ ల  ఐకాన్  స్కూలో స్వాతంత్ర్య దినోత్సవ  వేడుకలను ఎంతో ఘనంగా, దేశభక్తి ఉట్టిపడేలా నిర్వహించారు. విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు యాజమాన్యం, ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పాఠశాల  Chairman Amarendra, Director karthik, Principal Bhanu prakash, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ గౌరవవందనం సమర్పించి, ఉమ్మడిగా జాతీయ గీతాన్ని జనగణమన ఆలపించారు.

విద్యార్థులు త్రివర్ణ పతాక రంగుల దుస్తులు ధరించి దేశభక్తి గీతాలకు నృత్యాలు చేస్తారు.స్వాతంత్ర్య సమరయోధులు (భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి మొదలైన వారి) త్యాగాలను స్మరిస్తూ విద్యార్థులు వేసే నాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నర్సరీ, ప్రైమరీ క్లాస్ పిల్లలు జాతీయ నాయకుల గెటప్‌లలో అలంకరించుకుని వేదికపై సందడి చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.