16 August, 2026 | 1:01 PM

Districts - Rajanna Sircilla

article_72782052.webp
నాయకులంతా.. ఒక్కటైన వేళ..

ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలు, ప్రభుత్వ కార్యాలయాలు,వివిధ సంఘాలు,నాయకులు జాతీయ జెండాలను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలకించారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం,మనదేశం కోసం మహనీయుల పోరాటాలను విద్యార్థులకు తెలియజేశారు. పోతుగల్ గ్రామంలో మొదటి సారి గ్రామపంచాయతీ వద్ద జెండా ఆవిష్కరించిన సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్ ఈ సంవత్సరం పునః ప్రారంభమైన జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మళ్ళీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా నాయకులు పేర్కొన్నారు. ఒకే వేదికలో నాయకులంతా ఒక్కటైన వేళ..పార్టీలకతీతంగా ప్రభుత్వ బళ్లలో తమ వంతుగా విద్యార్థుల వసతుల కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం అభినందనీయం.

16-08-2026

article_79781776.webp
బి సి ఎం ట్రస్టులో పతాకావిష్కరణ

బోయినపల్లి: ఆగస్టు 15( విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక బుచ్చమ్మ చంద్రమౌళి మెమోరియల్ ట్రస్ట్ ఐ హాస్పిటల్ లో శనివారం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సర్పంచ్ కత్తెర పాక మంజుల సుధాకర్ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ గీతం పాడి పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఐ హాస్పిటల్ లో రంగురంగుల జాతీయ జెండాలతో ముస్తాబు చేదుగా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక లు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐ హాస్పిటల్ వైద్యులు వైద్య సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిదులు, ప్రముఖులు పాల్గొన్నారు.

15-08-2026

article_44027378.webp
ఘనంగా 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

వీర్నపల్లి,ఆగస్ట్ 15 (విజయక్రాంతి): వీర్నపల్లి మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు.తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయంతో పాటు తెలంగాణ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమైక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని వక్తలు పిలుపునిచ్చారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.మండల కేంద్రంలోని అన్ని కార్యాలయాలు, పాఠశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడంతో వీర్నపల్లి అంతటా పండుగ వాతావరణం నెలకొంది.

15-08-2026

article_73130728.webp
ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

రుద్రంగి ఆగస్టు 15(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వాడవడల మువ్వన్నెల జెండా రేపరేపాలడింది తహశీల్దార్ కార్యాలయంలో,ఏమ్మార్వో పుష్పలత,మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో,ఎంపిడిఓనట్రాజ్,పోలీస్టేషన్ లో SI మోతిరామ్,మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఛైర్మన్ చెలుకల తిరుపతి,గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ గండి నారాయణ,సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షుడు గసికంటి రాజు,గాంధీ విగ్రహం వద్ద ఉపసర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,అంబెడ్కర్ విగ్రహం వద్ద వార్డు మెంబర్ గుగ్గిళ్ల పావని వెంకటేష్, ఇందిరాగాంధీ విగ్రహం వద్ద వార్డు మెంబర్,శీలం స్వాతి మీనయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సమస్య మోహనరెడ్డి,బిజెపి పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కర్ణావత్తుల వేణు,బిఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్,పడమటి వాడ ముదిరాజ్ సంగంలో అధ్యక్షుడు జంగిలి శేఖర్,ప్రభుత్వ పాటశాలలో హెడ్మాస్టార్ సమ్మిరెడ్డి,కేరళ స్కూల్లో ప్రిన్సిపాల్ లతిక,జాతీయ జెండాను ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు,అలాగే కేరళ స్కూల్ విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో ఆటపాటలతో తీరంగా ర్యాలీ నిర్వహించారు.

15-08-2026

article_12900141.webp
కోనరావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కోనరావుపేట: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీలు నిర్వహిస్తూ దేశభక్తి నినాదాలతో వీధుల్లో సందడి చేశారు.కోనరావుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు యాస శ్రీనివాస్,గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ మస్కూరి కాశీరాం,తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో స్నిగ్ద, సెస్ కార్యాలయం వద్ద సెస్ఏ ఈ దివ్య, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ ప్రశాంత్‌రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి సురేష్, తెలంగాణ తల్లి విగ్రహం మండల మండల అధ్యక్షులు మల్యాల దేవయ్య, బిజెపి కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు మిరియాల్కర్ బాలాజీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు మానుక సత్యం, లు జాతీయ జెండాను ఎగురవేశారు.పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

15-08-2026