బి సి ఎం ట్రస్టులో పతాకావిష్కరణ
15-08-2026 05:12 PM
బోయినపల్లి: ఆగస్టు 15( విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక బుచ్చమ్మ చంద్రమౌళి మెమోరియల్ ట్రస్ట్ ఐ హాస్పిటల్ లో శనివారం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సర్పంచ్ కత్తెర పాక మంజుల సుధాకర్ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ గీతం పాడి పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఐ హాస్పిటల్ లో రంగురంగుల జాతీయ జెండాలతో ముస్తాబు చేదుగా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక లు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐ హాస్పిటల్ వైద్యులు వైద్య సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిదులు, ప్రముఖులు పాల్గొన్నారు.






