కోనరావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
కోనరావుపేట: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీలు నిర్వహిస్తూ దేశభక్తి నినాదాలతో వీధుల్లో సందడి చేశారు.కోనరావుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు యాస శ్రీనివాస్,గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ మస్కూరి కాశీరాం,తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో స్నిగ్ద, సెస్ కార్యాలయం వద్ద సెస్ఏ ఈ దివ్య, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ ప్రశాంత్‌రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి సురేష్, తెలంగాణ తల్లి విగ్రహం మండల మండల అధ్యక్షులు మల్యాల దేవయ్య, బిజెపి కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు మిరియాల్కర్ బాలాజీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు మానుక సత్యం, లు జాతీయ జెండాను ఎగురవేశారు.పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.






