నాయకులంతా.. ఒక్కటైన వేళ..
ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జీపీ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ యాదమ్మ శ్రీనివాస్
ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ముస్తాబాద్ మండలలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలు, ప్రభుత్వ కార్యాలయాలు,వివిధ సంఘాలు,నాయకులు జాతీయ జెండాలను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలకించారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం,మనదేశం కోసం మహనీయుల పోరాటాలను విద్యార్థులకు తెలియజేశారు. పోతుగల్ గ్రామంలో మొదటి సారి గ్రామపంచాయతీ వద్ద జెండా ఆవిష్కరించిన సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్ ఈ సంవత్సరం పునః ప్రారంభమైన జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మళ్ళీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా నాయకులు పేర్కొన్నారు. ఒకే వేదికలో నాయకులంతా ఒక్కటైన వేళ..పార్టీలకతీతంగా ప్రభుత్వ బళ్లలో తమ వంతుగా విద్యార్థుల వసతుల కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం అభినందనీయం.
విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.ఈసందర్బంగా ప్రధానోపాధ్యాయులు సుస్మిత మాట్లాడుతూ దాతలు తన్నీరు నర్సింగారావు సహకారంతో పాఠశాలకు రంగులు వేయడం,బురద కాకుండా నడిచేందుకు సీసీ వేయడం, సరస్వతి మాతను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.నాడు వెల వెల బోయిన బడి ఈ రోజు సర్పంచ్ యాదమ్మ శ్రీనివాస్ చొరవ అందరి సమిష్టి కృషితో ఈ బడికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. మీలాంటి నాయకులు ఇంత పెద్ద ఊరిలో ఉండడం మేము ఇక్కడ విధులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
అనంతరం నాయకులు మాట్లాడారు.మేము పుట్టి పెరిగిన ఊరు చదువుకున్న పాఠశాలను ఎప్పటికీ మరువబోమని మా నుండి సాధ్యమైనంత వరకు పాఠశాల అభివృద్ధి కోసం ముందు ఉంటామని తెలిపారు.విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలోఅమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ జ్యోతి,ఉప సర్పంచ్ కోల కృష్ణ,వార్డ్ సభ్యులు జంగ రాజు, భవాని,లాస్య,ఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సయ్య, సింగల్ విండో చైర్మన్ బాపూరావు,మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్,మాజీ సర్పంచ్ ద్యావత్ పండరి, నాయకులు పెద్దిగారి శ్రీనివాస్,తోట దర్మేందర్, మాజీ ఎంపీటీసీ బాలకిషన్, హరిబాబు,బాలయ్య,బాల్ నర్సయ్య,వెంకటేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.






