15 August, 2026 | 5:13 PM

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 04:11 PM

చందుర్తి,ఆగష్టు 15,(విజయక్రాంతి) :స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చందుర్తి సింగిల్ విండో కార్యాలయంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జాతీయ పతాకాన్ని పాలకవర్గ సభ్యులు మరియు రైతు సోదరులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, పొన్నాల శ్రీనివాస్,చింతపల్లి రవీందర్,సిరికొండ శ్రీనివాస్, చిలుముల హన్మయ్యచారి, బత్తుల కమలాకర్,రైతులు తదితరులు పాల్గొన్నారు.