14 August, 2026 | 9:30 PM

సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

14-08-2026 08:19 PM

హర్షం వ్యక్తం చేస్తున్న లింగంపేట రైతులు

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన గ్రామ ప్రజలు, రైతులు

చందుర్తి,(విజయక్రాంతి): మండలంలోని లింగంపేట గ్రామంలో నూతన సబ్ స్టేషన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రజా పాలనలో రైతన్న ల కోసం నాణ్యమైన విద్యుత్ అందించాలని ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెలలో తెలంగాణ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సబ్ స్టేషన్ భూమి పూజ చేసారు.

33/11 కె వి, 3 కోట్ల 52 లక్షల 10 వేల రూపాయల తో సబ్ స్టేషన్ కు మంజూరు చేసారు.ఎన్నో ఏండ్ల కళ నెరవేరుతున్నందున లింగంపేట గ్రామం లో రైతులు ప్రజలు లో వోల్టెజ్ బాధ తీరిపోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది దీపావళి లోగా సబ్ స్టేషన్  మొత్తం పనులు పూర్తి అవుతాయిని కాంట్రాక్టర్ చెప్తున్నారు.ఈ సందర్బంగా గ్రామ ప్రజలు విప్ ఆదిశ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.