15 July, 2026 | 1:39 AM

Districts - Jogulamba Gadwal

article_29916481.webp
సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన

గద్వాల, (విజయక్రాంతి) : సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ప్రజా రంజక పాలన అందిస్తోందని రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం ధరూర్ మండల కేంద్రంలో జోగులాంబ జిల్లా వ్యాప్తంగా వివిధ రహదారుల విస్తరణ, మరమ్మత్తుల నిర్మాణానికి రూ.339.39 కోట్ల నిధులతో చేపట్టిన హామ్ రోడ్ల పనులకు మంత్రి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 25 వేల కోట్లకు పైగా నిధులను మంజూరు చేయడం గర్వకారణమని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

14-07-2026