పేకాట స్థావరంపై పోలీసుల దాడి
10-08-2026 01:41 AM
అయిజ, ఆగస్టు 9: అయిజ మండలం చిన్నతాండ్రపాడు గ్రామ శివారులోని బోయ తిరుమల్ మామిడి తోటలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఆదివారం పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.9,110 నగదు, ఆరు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్త్స్ర గురుస్వామి తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.






