సమగ్ర విద్యపై అవగాహన
13-08-2026 01:20 AM
ఎర్రవల్లి, ఆగస్టు 12 (విజయక్రాంతి): మండల పరిధిలోని కొండైర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సమగ్ర విద్యపై అవగాహన కార్యక్రమంను బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి అమీర్ పాషా పాల్గొని, ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు కల్పించి వారి ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థుల హక్కులు, ప్రభుత్వ పథకాలు, విద్యా అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.






