13 August, 2026 | 2:29 AM

హెచ్‌ఐవీపై అవగాహనతోనే నివారణ

13-08-2026 01:27 AM

గద్వాల, ఆగస్టు 12 (విజయక్రాంతి): హెచ్‌ఐవీ/ఎయిడ్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, అపోహలను తొలగించాలని అదనపు కలెక్టర్ మధు మోహన్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్‌ఐవీ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. హెచ్‌ఐవీపై అనుమానం ఉన్నవారు సంకోచం లేకుండా పరీక్షలు, కౌన్సెలింగ్, వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిపై వివక్ష చూపకుండా గౌరవంతో చూడాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీఎంహెచ్వో సంధ్య కిరణ్మయి, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.