14 August, 2026 | 3:12 AM

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

14-08-2026 12:07 AM

అలంపూర్, ఆగస్టు 13: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం అలంపూర్లోని శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, ఆలయ సిబ్బంది సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు. మంత్రి వెంట అలంపూర్ మున్సిపల్ చైర్మన్ జయరాములు, బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు