9 May, 2026 | 11:28 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

గ్రామీణ క్రీడాకారుల ప్రోత్సాహానికి వైవీఆర్ యువసేన కృషి

09-02-2026 12:00 AM

కోదాడ, ఫిబ్రవరి 8 : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వైవిఆర్ యువసేన కృషి చేస్తుందని వ్యవస్థాపకులు ఎలుగూరు కిరణ్ తెలిపారు. ఆదివారం నడిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులకు 50 వేల రూపాయల విలువగల 100 క్రీడా టీ షర్టులు వైవిఆర్ యువసేన పంపిణీ చేసింది. క్రీడలను ప్రోత్సహించడమే కాక, గ్రామంలో సామాజిక కార్యక్రమాలు కూడా చేపడతామని, క్రీడాకారులు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని కిరణ్ సూచించారు. కార్యక్రమంలో క్రీడాకారులు, ఉపాధ్యా యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.