26 May, 2026 | 5:14 AM

గ్రామాలలో ‘యువ ఆపద మిత్ర’ సేవలు అందించాలి

26-05-2026 01:43 AM

కల్నల్ లక్ష్మారెడ్డి

నల్లగొండ టౌన్ మే 25: గ్రామాల్లో యువ అపద మిత్ర సేవలు అందించాలని కల్నల్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం ఎంజియూ లో 31 బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో 7 రోజులపాటు క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు ఎన్సీసీ కేడెట్లు తమ తమ గ్రామాలు, పట్టణాలు, కాలనీలలో విపత్తు సంభవించిన ప్రతి సందర్భంలో ముందు స్పందించాలన్నారు.

ఏడురోజుల్లో నేర్పిన జ్ఞానం, నైపుణ్యాన్ని కమ్యూనిటీకి చేరవేయాలన్నారు. సమాజంలో ప్రతి కుటుంబం, ప్రతి వీధిలో విపత్తు అవగాహన పెంచినప్పుడే ప్రాణనష్టం తగ్గించగలమన్నారు. నేషన్ ఫస్ట్ అనే ఎన్సీసీ నినాదాన్ని ఆచరణలో చూపించాలంటే విపత్తుల సమయంలో భయపడకుండా, నియమ నిబంధనలను పాటిస్తూ, సంబంధిత శాఖల (పోలీస్, ఫైర్, ఆరోగ్య, రెవెన్యూ, స్వచ్ఛంద సంస్థలు)తో సమన్వయం చేసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

చెట్లు నాటడం, డ్రైన్లు పరిశుభ్రంగా ఉంచడం, గృహ నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటించడం వంటి చర్యల్లో కూడా ఎన్సీసీ కేడెట్లు పాత్ర కీలకమన్నారు.ఎం జి యూ వీసీ కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ ఎన్సీసీ కేడెట్లు విపత్తు నిర్వహణలో శిక్షణ పొందడం దేశ భద్రతకు, సమాజ భద్రతకు అవసరమైన పెట్టుబడి అన్నారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, డిఆర్డిఓ పీడీ శేఖర్ రెడ్డి, ఇంజరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రేఖ, 31వ బెటాలియన్ అధికారులు లెఫ్టినెంట్ కల్నల్ శశిధర్ రావు, సుబేదార్ మేజర్ మాధవరావు, సుబేదార్ మల్లయ్య,ఆశిష్ కుమార్ యూసుఫుద్దీన్, డాక్టర్ జి. మచ్చేందర్ , డాక్టర్ రాము, సిటిఓ నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.