బీసీలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశే నయం
2008లో వైఎస్‌తో పోరాడి ఫీజుల రీయింబర్స్‌మెంట్ సాధించుకున్నాం
పథకం రద్దుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుంది
బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్, ఏప్రిల్ 3(విజయక్రాంతి): గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ విద్యార్థుల ఉన్నత చదువుకు భరోసా కల్పించడానికి 2008లో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోరాడి, ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని సాధించుకున్నా మని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత బీఆర్‌ఎస్ నుంచి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్నాయని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు శుక్రవారం హైదరాబాదులోని బీసీ జేఏసీ కార్యాలయంలో బీసీ సంఘాల నేతలతో కలిసి మీడియాతో జాజూల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. బీసీల విషయంలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రంలోనే తీరని అన్యా యం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా ఫీజుల రీయిం బర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం తో 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, వేలాది మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరం అవుతున్నారన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూనే, ఇంకొక వైపు ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్రలు చేస్తుందన్నారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పు బీసీలను తీవ్ర గందరగోళంలోకి నెట్టివేసిందన్నారు. ఈ విషయం లో ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సం ఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాద వ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కో చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, బండిగారి రాజు, ఆవుల నరేష్, ఎ. నరసమ్మ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.




