ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరికాదు
- పేద విద్యార్ధుల చదువులకు తీవ్ర నష్టం
- తీర్పును పునఃసమీక్షించాలి
- ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ
హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): హైకోర్టు ఫీజు బకాయిలపై ఇచ్చిన తీర్పులో విద్యార్థుల నుంచి వసూళ్లు చేసుకుని ప్రభు త్వం ఇచ్చిన తర్వాత తిరిగి విద్యార్ధులకు చెల్లించాలని తీర్పు సరైనది కాదని, ఇది విద్యార్థుల చదువుల అభివృద్ధికి గొడలిపెట్టని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పేర్కొంది. హైకోర్టు తీర్పును పునఃసమీక్షచేయాలని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ కోరింది. ఈమేరకు ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టీ.నాగరాజు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశా రు.
ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వం ప్రకటించిన ఫీజు పథకం అమలు చేస్తామని అంగీకారాన్ని తెలిపి విద్యార్థులను చేర్చుకున్నారని, అలాంటిది ప్రైవేటు యాజమాన్యాల బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వకుండా విద్యార్ధుల నుంచి వసూళ్లు చేసుకోండి అనే తీర్పు సరైనది కాదని తెలిపారు.
అణాగారిన వర్గాలు నుంచి ఇప్పుడే ఉన్నత విద్యలోకి వస్తున్న ప్రధానంగా ఈ ఫీజులు పోందే వారు పేద విద్యార్థులు వారిలో రాష్ట్రంలో 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్ధులే ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారని, వారిని ఈ తీర్పు వల్లన మరింత వేధింపులు గురవుతారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు యాజమా న్యాలు ఫీజులు బకాయిలు రావడంలేదని పేద విద్యార్థుల సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వేధింపులు గురి చేస్తున్నారని, దీని వల్ల గతంలో విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని తెలిపారు.
ఉన్నత విద్యకు దూరం: పీడీఎస్‌యూ
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హైకోర్టు వ్యాఖ్యలు పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేలా ఉన్నాయని పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పీ.మహేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాడపంగి నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోతే ఆ ఫీజులను విద్యార్థుల దగ్గరే వసూలు చేసి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఆ ఫీజును విద్యార్థులకు ఇవ్వండని హైకోర్టు వ్యాఖ్యలను సమీక్షించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్‌లో పెట్టిందని, దాన్ని విడుదల చేయడంలో రేవంత్ సర్కారు తీవ్ర జాప్యం చేస్తోందని పేర్కొన్నారు. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. బకాయిలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు దాని ఊసే ఎత్తకపోవడం దారుణమని తెలిపారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేసే కుట్ర: ఏఐఎస్‌ఎఫ్
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ, పుట్ట లక్ష్మణ్ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు పేద, మధ్య తరగతి విద్యార్థులకు వ్యతిరేకంగా ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో వారు తెలిపారు.
విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని, ఈ తీర్పుపై హైకోర్టు పునరాలోచన చేయాలని కోరారు. ఈ పథకంపైనే ఆధారపడి లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారని, రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం దారుణమన్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ఫీజులు వసూలు చేస్తాం..
హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేందుకు ప్రైవేట్ కాలేజీల యాజ మాన్యాలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య సమావే శం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్న ట్లు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బీ.సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.
తాము కోర్టు ఆదేశాలను పాటిస్తూ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకుం టామని, అయితే హైకోర్టు ఆర్డర్ కాపీని ఆధారంగానే ఫీజులు వసూలు చేసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయిం చినట్లుగా తెలిపారు. అదేవిధంగా ఈనెల 11న సమావేశం ఏర్పాటు చేసుకుని పెండింగ్ ఫీజు బకాయిలపైన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని, తమ సమస్యను ప్రభుత్వానికి వినిపిస్తామన్నారు.




