29 May, 2026 | 9:12 PM

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

29-05-2026 04:18 PM

“నషా ముక్త్ భారత్” లక్ష్యంగా ముందుకు సాగాలి 

రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): యువత మాదకద్రవ్యాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.“నషా ముక్త్ భారత్” లక్ష్యంగా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకోవాలని సూచించారు.సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు మౌనంగా ఉండకూడదని, ప్రజా వ్యతిరేక చర్యలను అరికట్టేందుకు అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.