30 April, 2026 | 12:13 AM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

మొబైల్ మాయలో యువత

26-04-2026 12:00 AM

సమాచార రంగంలో నూతన విప్లవానికి కారణమైన మొబైల్ ఫోన్ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టే, స్మార్ట్‌ఫోన్ వల్ల ఉపయోగాలతో పాటు అనర్థాలు ఉన్నాయి. సమాజానికి అదుపుతప్పిన సరికొత్త అలవాట్లను పరిచయం చేస్తున్న సాంకేతిక సాధ నాల్లో మొబైల్ కూడా ఒకటి. ముఖ్యంగా నేటి యువత స్మార్ట్‌ఫోన్‌కు బానిసలుగా మారుతున్నారు. కొన్నేళ్ల నుంచి స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 కోట్ల కు పైగా ఫోన్లను వాడుతున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఒక గొప్ప ఆశయంతో మొబైల్‌ను ఆవిష్కరించారు. కానీ, నేటి తరం దాన్ని దుర్వినియోగం చేస్తున్నది. గంటల కొద్దీ స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోయి అనవసరమైన విషయాల గురించి అందులో శోధిస్తూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

విద్వేషపూరితమైన, అసందర్భమైన విషయాలను షేర్ చేస్తున్నారు. అంతేకాదు, కొందరు ఇతరుల మనోభావాలను గాయపరిచే పోస్టులను పెడుతూ వికృతానందం పొం దుతున్నారు. ఉన్నతమైన, విజ్ఞానపరమైన చరిత్రలను తెలుసుకోవడానికి ఉపయోగించకుండా అనవసరమైన విషయాలపై దృష్టిపెడుతూ ఒక విద్వేష పూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు వచ్చిన నాటి నుంచి మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి.

కనీసం పక్కన ఉన్నవారిని ప్రేమగా, ఆపాయ్యతగా పలకరించే పరిస్థితి లేకుండా పోయింది. నేటి సమాజంలో చాలామంది వారి వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ నవ్వులపాలు అవుతున్నారు. మరికొందరు మొబైల్ సాయంతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

కొందరు కుటుంబ విషయాలను నలుగురిలో పెట్టి, బంధాలను పొగొట్టుకొని మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా సమాజంలో మార్పు రావాలి. యువత స్మార్ట్‌ఫోన్ల వాడకంపై నియంత్రణ పాటించాలి. అదే యువతకు, ఈ సమాజానికి ఆర్యోగకరం.

 కామిడి సతీష్ రెడ్డి, 9848445134