1 July, 2026 | 1:23 AM

ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడి ఆత్మహత్య

01-07-2026 12:25 AM

కూకట్ పల్లి, జూన్ 30 (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ నగర్ లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ ప్రైవేట్ ఉమెన్స్ కళాశాల లో ఆయమ్మగా పనిచేస్తూన్న మసపలూరు రత్నమ్మ (60), ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న  ఆమె కుమారుడు ముసపలూరు రాజు (34) తో కలిసి హైదర్ నగర్ లో నివసిస్తుంది.

రాజు గత కొంతకాలంగా అప్పుల పాలై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని తల్లి రత్నమ్మతో చెప్పి బాధపడేవాడు. తల్లి కుమారునితో నువ్వేమి ఇబ్బంది పడవద్దు అప్పులు మెల్ల మెల్లగా తీరుద్దామని కుమారునికి ధైర్యం చెప్పింది. రత్నమ్మ రోజువారిలాగే మంగళవారం ఉదయం 8 గంటలకు కళాశాలకు వెళ్ళింది.

ఆమె మేనల్లుడు మణికంఠ గం .11.30 లకు ఇంటికి వెళ్లి చూడగా రాజు గదిలో సీలింగ్ ఫ్యాన్ రాడ్ కు చీరతో ఉరివేసుకొని మృతి చెందడం గమనించాడు. వెంటనే మణికంఠ అతని మేనత్తకు రాజు ఉరి వేసుకున్న విషయాన్ని తెలియపరచాడు. సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీస్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.