1 July, 2026 | 2:22 AM

ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని..

01-07-2026 01:22 AM

అన్నదాతలు సుఖసంతోషాలతో ఉండాలని..

వర్షాలు సమృద్ధిగా కురవాలని..

గోమాతకు వివాహం.. ఏరువాక పూజలు..

ఎలిగేడు, జూన్ 30 (విజయక్రాంతి): ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని... అన్నదాతలు సుఖ సంతోషాలతో ఉండాలని... వర్షాలు సమృద్ధిగాపడాలని.. గోమాతకు వివాహం చేయడంతో పాటు... ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లలితపల్లి గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా గోమాతకు కళ్యాణం జరిపించారు, బహు సమ్మయ్య దంపతులు, పురోహితుడు నాగరాజు శర్మ ఆధ్యర్యంలో ఘనంగా కళ్యాణం నిర్వహించారు.

గోమాతకు కళ్యాణం జరిపిస్తే సకలశుభాలు కలుగుతాయని ప్రజలంతా సుభిక్షంగా ఉంటారనివారి నమ్మకం... శ్రేష్ట మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమినిగా ఒక పండుగగా రైతులు జరుపుకుంటారు.. ఏరు అంటే నీరు లేదా నాగలి అని, వాక అంటే ప్రారంభం అని అర్థం...రైతులకు అత్యంత ప్రాముఖ్యమైన పండుగ ఏరువాక పౌర్ణమి... వాన కాలం పంటలను రైతులు ఏరువాక పౌర్ణమి నాడుప్రారంభిస్తారు... ఏరువాక పౌర్ణమి నాడు గోమాత కళ్యాణం జరిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు,  ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...