6 July, 2026 | 1:07 PM

Breaking News

సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •   సాయి నగర్ మురికి కాలువ లో ముళ్ళ పొదల తొలగింపు   •   పారిశుద్ధ్యం... పంచాయతీ కేంద్రాల్లో అధ్వానం   •  

యువతులూ.. అప్రమత్తంగా ఉండండి

24-02-2026 12:00 AM

పెళ్లి ముసుగులో వంచన చేస్తారు

వేధింపులు ఎదురైతే షీ టీమ్స్ లేదా డయల్ 100కి ఫోన్ చేయండి 

నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్  

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున జరుగుతున్న మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ యువతులను అప్రమత్తం చేశారు. నిశ్చితార్థం కాగానే ఎలాగూ పెళ్లే కదా అని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకోవడం, ఆ తర్వాత అదనపు కట్నం కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఘటనలు నగరంలో పెరుగు తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశా రు.

ఈ మేరకు సోమవారం ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.పెళ్లి ఆగిపోతే సమాజంలో పరువు పో తుందనే భయంతో బా ధితులు ఫిర్యాదుకు వెనకడుగు వేస్తుండట మే కేటుగాళ్లకు వరం గా మారుతోందని సీపీ పేర్కొన్నారు. పెద్దలు కు దిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు.. కాబోయే వాడి ప్రవర్తన, స్నేహితులపై ఆరా తీయాలి. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవాలని, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే కచ్చితంగా అనుమానించాలి.

వారి ప్రయత్నాలను ధైర్యంగా తిరస్కరించాలి. పరువు కోసం భయపడి మౌనంగా ఉంటే జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది అని హెచ్చరించారు.మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు భయపడకుండా ముందుకు రావాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సజ్జనార్ భరోసా ఇచ్చారు. ఇలాంటి వేధింపులు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్‌కు గానీ, డయల్ 100కు గానీ కాల్ చేయాలని సూచించారు.