6 July, 2026 | 1:53 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి

06-07-2026 01:04 PM

కాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న శివంపేట్ ఎంపీడీవో కార్యాలయం !!

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి.    

శివంపేట్ జులై 6 (విజయక్రాంతి): ప్రజా సమస్యలే ప్రభుత్వ ధ్యేయంగా ఒకవైపు ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంటే శివ్వంపేట మండలంలో మాత్రం ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. వివిధ రకాల ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న శివ్వంపేట మండలం లో మాత్రం ఏ శాఖ కు సంబంధించిన అధికారి మాత్రం సమయపాలన్న పాటించకుండా ప్రజావాణి లో హాజరు  కాకపోవడం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే అన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి అన్నారు.

సమయపాలన పాటించని అధికారులపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.శివ్వంపేట ప్రజావాణి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించక లేకపోవడం వలన శివ్వంపేట మండల ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయనికి వెళ్ళడం జరుగుతోందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన ఉన్నతాధికారులను  కోరారు. గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సమస్యల పట్ల ఉన్నతాధికారులు చొరవ చూపాలన్నారు.