స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు
06-07-2026 12:58 PM
విజయక్రాంతి ఎఫెక్ట్
బెజ్జూర్: మండల కేంద్రంలోని " సీసీ రోడ్డుపై బురద పట్టించుకోని అధికారులు" అనే కథనం విజయక్రాంతి(Vijayakranthi Effect) దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గ్రామ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి, కార్యదర్శి వైకుంఠం స్పందించి సీసీ రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని ట్రాక్టర్ ద్వారా శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లపై చెత్త వేయకూడదని, వర్షాలు కురుస్తున్నందున ఇంటి పరిసరాలలో నీరు నిలవకుండా చూసుకోవాలని వారు సూచించారు. వారి వెంట కారోబార్ వసంత్ ఉన్నారు.






